Biographical sketch of mother teresa in telugu
Mother teresa quotes
Mother teresa controversy!
కష్టాల్లో ఉన్నవారిని వెతికి మరీ సాయం చేసిన విశ్వమాత.. మదర్ థెరిసా
Samayam Telugu | Updated: 26 Aug 2021, 7:49 am
Subscribe
హైలైట్:
- కోల్కతా మురికివాడల్లో అభాగ్యులకు సేవలు.
- పేదల కోసం మిషనరీ ఆఫ్ ఛారిటీ ప్రారంభం.
- హిందూ ఆలయంలో నిర్మల్ హృదయ్ ఏర్పాటు
తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి అమ్మగా మారింది. భారతీయులతో ‘అమ్మ’అని పిలిపించుకున్న అంతటి మహొన్నత వ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 1910 ఆగష్టు 26న యుగోస్లేవియాలో జన్మించిన మదర్ థెరిసా అసలు పేరు ఆగ్నెస్ గోన్సా బొజాక్ష్యూ.
మదర్ తండ్రి కూడా ఇతరులకు సేవ చేయడంలో ముందుండేవారు.
Biographical sketch of mother teresa in telugu
అనాథల కోసం లెట్నికాలో ఆయన స్థాపించిన ఓ ఆశ్రమం ఇప్పటికీ ఎంతో మందికి అన్నం పెడుతోంది.తండ్రి సేవాతత్వాన్ని పుణికిపుచ్చుకున్న మదర్ థెరిసా... అనారోగ్యంతో ఆయన 1919లో కన్నుమూయగా, మరణానికి ఆయన పడిన బాధ చూసి తీవ్ర ఆవేదనకు గురైంది. 12 ఏళ్ల వయస్సులోనే సేవ